వారం రోజుల్లో పెళ్లి కూడా..జాన్వీ కపూర్‌!

Wednesday, January 22, 2025

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ , అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌ ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. ఇటు తెలుగు, అటు హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా జాన్వీ, రాజ్‌ కుమార్‌ రావ్‌ కలిసి నటించిన సినిమా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి. ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుంది.

ఇందులో మహిమ పాత్రలో జాన్వీ.. మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌ కనిపించనున్నారు. మే 31న మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  ఈ మూవీ ప్రమోషన్లతో ప్రస్తుతం జాన్వీ బిజీగా ఉంది. ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ పాల్గొనగా.. పెళ్లి గురించి ఓ ప్రశ్న వచ్చింది. మీ ప్రియుడు శిఖర్ పహారియాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడగ్గా.. అందుకు జాన్వీ నవ్వుతూ సమాధానమిచ్చారు.

ప్రస్తుతానికి కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాను అని స్పష్టం చేశారు. ‘ఇటీవలి రోజుల్లో నేను కూడా కొన్ని వార్తలు చదివాను. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాసుకొచ్చారు.  నాకు కూడా తెలియకుండానే మరో వారం రోజుల్లో నా పెళ్లి చేసేలా ఉన్నారు. ప్రస్తుతం నేను కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు… ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు’ అంటూ జాన్వీ తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles