దేవర పై సాలిడ్‌ అప్డేట్‌ ఇచ్చిన జాన్వీ!

Sunday, December 22, 2024

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ న‌టిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవ‌ర’ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.  ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫ‌స్ట్ సాంగ్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా రెట్టింపు చేశాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి జాన్వీ క‌పూర్ ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని తెలిపింది. జాన్వీ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దేవ‌ర సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. దేవ‌ర సినిమాతో సౌత్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని ఆమె వివరించింది.

ఇక దేవ‌ర సినిమాలో త‌న పాత్ర చాలా బాగుంటుంద‌ని, దేవ‌ర పార్ట్-2లో త‌న పాత్రకు మ‌రింత స్కోప్ ఉంటుంద‌ని ఆమె వివరించింది. దీంతో దేవ‌ర పార్ట్-1లో జాన్వీ పాత్ర ఎలా ఉంటుందా.. పార్ట్-2లో ఆమె పాత్ర‌ను హైలైట్ చేయనున్నారా.. అనే ఆస‌క్తి ఇప్పటికే అభిమానుల్లో నెల‌కొంది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న దేవ‌ర పార్ట్-1 చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న విడుదల చేసేందుకు మూవీ మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles