జనక అయితే గనక…ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్‌!

Wednesday, January 22, 2025

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న తాజా సినిమా ‘జనక అయితే గనక’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర బృందం తెరకెక్కించింది. ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదల అయిన కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమాపై మరిన్ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు ట్రైలర్‌ని కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దం అయ్యారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 12న గ్రాండ్ విడుదలకు సిద్ధం చేయడంతో, ఈ ట్రైలర్‌ను అక్టోబర్ 9న ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా.. సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఉండనుందని సినిమా బృందం తెలిపింది.

ఈ సినిమాలో సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles