ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జక్కన్న!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్‌ వైడ్‌ గా పెద్ద హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి తరువాత సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా సూపర్‌ స్టార్ మహేష్‌ తో అనే సరికి అందరి చూపు ఆ సినిమా మీదే పడింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో మేకర్స్ బిజీ గా వున్నారు.

మహేష్ బాబు 29 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ కె.ఎల్‌.నారాయణ గతంలో ‘హలో బ్రదర్‌’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’,   ‘సంతోషం’ వంటి సూపర్ హిట్‌ చిత్రాలను నిర్మించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి,మహేష్ కాంబినేషన్ లో వస్తున్నమూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలా గ్యాప్‌  తరువాత ఎస్‌ఎస్‌ఎంబీ 29’ని ప్రొడ్యూస్‌ చేస్తున్నాను. అయితే తాను ఉద్దేశపూర్వకంగా విరామం తీసుకోలేదని ఆయన ప్రకటించారు.

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమాను 15 ఏళ్ల క్రితమే ఫిక్స్‌ చేసామని ఆయన తెలిపారు. కానీ వాళ్లు  వున్నబిజీ షెడ్యూల్స్ వల్ల అప్పుడు కుదరలేదు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్‌ భారీగా పెరిగింది అని ఆయన వివరించారు. అయినా కూడా రాజమౌళి ఇచ్చిన మాట కోసం నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా ‘దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌’లో మూవీ తీస్తున్నట్లుగా వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని.

రాజమౌళికి హాలీవుడ్‌ నుంచీ ఎన్నో భారీ ఆఫర్లు వచ్చాయి.అయినా కూడా వాటిని వద్దు అనుకుని  నా కోసం సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. రెండు నెలల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ సాగుతుందని ఆయన వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles