ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షనే కాదు డ్యాన్స్ కూడా అదరగొడతారు. కొంతకాలం క్రితం భార్యతో కలిసి వేడుకలో డ్యాన్స్ చేసిన అలరించిన ఆయన.. మరోసారి తనలోని డ్యాన్స్ టాలెంట్‌ను బయటకు తీశారు. తన సతీమణి రమా రాజమౌళితో కలిసి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్. ఎమ్. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా పెళ్లి వేడుకల్లో భాగంగా రాజమౌళి దంపతులు ఇలా డ్యాన్స్ చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రాజమౌళి డ్యాన్స్ పై లైకులు కొట్టేస్తున్నారు.
రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ‘RRR’ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB29’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కాబోతున్నారు.