టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన సినిమా SSMB29. ఎందుకంటే ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి లాంటి క్రేజీ కాంబినేషన్ కనిపించబోతోంది. ఈ సినిమాపై మొదటి నుంచి ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నప్పటికీ, బయటికి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనివల్ల అభిమానులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకూ రాజమౌళి తీసిన ప్రతి సినిమాకూ ముందుగానే అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చేవి. ఫస్ట్‌లుక్ అయినా, టైటిల్ అయినా, ఏదో ఒక అప్డేట్‌తో హైప్ క్రియేట్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం స్ట్రాటజీ మారినట్టు కనిపిస్తోంది. మహేష్ బాబుతో చేస్తున్న ఈ భారీ సినిమాపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రారంభోత్సవం కూడా చాలా సింపుల్‌గా జరిగిపోయింది. షూటింగ్ మొదలైనా కూడా బయటికి ఎలాంటి విశేషాలు చెప్పడం లేదు.
అందుకే ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది. రాజమౌళి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంత సీక్రసీ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు బజ్ క్రియేట్ చేయాలంటే అప్పుడప్పుడూ చిన్న చిన్న అప్డేట్లు అవసరమని అభిమానులు భావిస్తున్నారు. లేదంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని అంటున్నారు.
అయితే రాజమౌళి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక స్ట్రాటజీ ఉంటుంది. అసలు సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడొస్తుందో, జక్కన్న ఎప్పుడు మౌనం విడతాడో చూడాలి. అప్పటివరకు ఫ్యాన్స్ మాత్రం ఆశతో ఎదురు చూస్తున్నారు.
