ఓటేసేందుకు దుబాయ్ నుంచి వచ్చిన జక్కన్న!

Andhrawatch
1 Min Read

తన సినిమాలతో భారతీయ చలన చిత్ర పరిశ్రమను ప్రపంచానికి తెలియజెప్పిన దర్శక దిగ్గజం ఎస్ఎస్‌ రాజమౌళి. నిన్నటి వరకు రాజమౌళి దుబాయ్‌ లో ఉన్నారు. సోమవారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఆయన నేరుగా ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌ కి చేరుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన అలసిపోయిన కన్నులతో ఓటు వేసినట్లు జక్కన్న పేర్కొన్నారు. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారా అంటూ అభిమానులను అడిగారు.  తను ఓటు వేసిన విషయాన్ని వెల్లడించడానికి ఫోటోను షేర్ చేశారు. సిరా ఉన్నటువంటి వేలిని చూపిస్తున్న రమా రాజమౌళి, జక్కన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో జక్కన్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 వ సినిమాని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను  జక్కన్న హాలీవుడ్ లెవెల్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Share This Article