జై హనుమాన్‌ అన్నారు కదా… మరి ఇదేంటీ!

Sunday, December 22, 2024

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మూవీల్లో బ్లాక్‌ బస్టర్ హిట్‌ అందుకున్న సినిమాల్లో హనుమాన్‌ ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాగా వచ్చి కోట్ల బడ్జెట్ ను రాబట్టింది.  బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా ని డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించాడు.

జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచే కొత్త తరహా సినిమాలను  తెరకెక్కిస్తూ ప్రేక్షకుల పల్స్‌ పట్టుకున్నాడు. అలానే కొత్త స్క్రిప్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.  ఇక హనుమాన్ సినిమాతో మరోసారి తన సత్తాను సినీ ప్రపంచానికి చూపించాడు.

 పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. ఇటీవల ఓటీటీ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా అక్కడ కూడా భారీ వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.ఈ సినిమా తీసిన సమయంలోనే దీనికి సీక్వెల్‌ కూడా ఉంటుందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సీక్వెల్ గా  ‘జై హనుమాన్’ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.  వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుందని చెప్పినా ఇప్పటివరకు సినిమా స్క్రిప్ట్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే ఈ సినిమా కన్నా ముందు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రశాంత్‌ వర్మ.

 ‘ఆక్టోపస్’ అనే సినిమాని పూర్తి చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ చాలా కాలం క్రితమే సెట్స్ మీదకు తీసుకెళ్లిన సబ్జెక్ట్‌ .  ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని ఇండస్ట్రీల టాక్‌.

ఫస్ట్ ఆ సినిమాను పూర్తి చేసి తర్వాత జై హనుమాన్ సినిమాను మొదలు పెట్టబోతున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్‌ . ఆ తర్వాత ‘ జై హనుమాన్ ‘ ను సెట్స్ మీదకు తీసుకువస్తాడని టాక్‌. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles