జగపతిబాబు-అనసూయ సింబా ట్రైలర్!

Saturday, September 7, 2024

జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ, అలనాటి హీరోయిన్ గౌతమి కీల‌క పాత్ర‌లు పోషించిన మూవీ సింబా. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్‌ గా నిర్వహించి సింబా ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్ల‌ని పెంచండి ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించండి అనే సూపర్‌ సందేశాన్ని ఇస్తూ చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే ఓ టీచర్‌…వరుస హత్యలు చేస్తున్న లేడీగా అనసూయని చూపించారు.

దాని చుట్టూ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, స‌స్పెన్స్, కొన్ని యాక్షన్ ఘట్టాలు, అక్కడక్కడ కొన్ని నవ్వులు, సామాజిక అంశానికి, ఆస‌క్తిక‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి టీజర్ని అద్భుతంగా కట్ చేసారు మూవీ మేకర్స్. కాగా ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనసూయను విజయ్ దేవరకొండ వివాదం గురించి ప్రశ్నించగా అన‌సూయ మాట్లాడుతూ “విజ‌య్ స్టేజ్ మేన‌ర్స్ పైనే అప్పుడు గొంతు విప్పాను, లైమ్ లైట్ లో ఉన్న‌ప్పుడు ఎవరైనా సరే ప‌ద్ధ‌తిగా ఉండాలి, అందుకోసమే మాట్లాడాల్సివ‌చ్చింది, నిజానికి ఇది మీడియా బాధ్య‌త అని, మీడియా మాట్లాడ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆరోజు స్పందించాల్సి వ‌చ్చిందని, అయితే ఈ ఇష్యూతో నేను కొంత నేర్చుకున్నాను, చెప్పాల్సిన విష‌యాన్ని స‌రిగ్గా క‌న్వే చేస్తే బాగుండేది, ఇప్పుడు విజయ్ తో ఎటువంటి ఇష్యూ లేదు” అని అనసూయ చెప్పుకొచ్చింది.

సంపత్ నంది కథ అందించిన సింబా చిత్రానికి మురళి మనోహర్ డైరెక్షన్‌ వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles