ది వ‌రల్డ్ ఆఫ్ సోకుల‌పాలెనికి టైమ్‌ వచ్చేసిందోచ్‌!

Sunday, December 22, 2024

నేచుర‌ల్ స్టార్ నాని తాజాగా న‌టిస్తున్న సినిమా ‘స‌రిపోదా శ‌నివారం’ ప్ర‌స్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని విడుదలకి రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి వ‌రుస అప్డేట్స్ తో  మూవీ మేక‌ర్స్ సంద‌డి చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘ది వ‌ర‌ల్డ్ ఆఫ్ సోకుల‌పాలెం’ మేకింగ్ వీడియోను విడుదల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేకింగ్ వీడియోను ఆగ‌స్టు 4న సాయంత్రం 4.05 గంట‌ల‌కు విడుదల చేస్తున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. ఈ సినిమా క‌థ మొత్తం సోకుల‌పాలెం అనే ఊరిలో జ‌ర‌గ‌నున్న‌ట్లుగా సమాచారం

ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా.. విల‌క్ష‌ణ న‌టుడు ఎస్.జె.సూర్య విల‌న్ పాత్ర‌లో చేస్తున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్టు 29న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles