అప్పుడే పదేళ్లా…నమ్మలేకపోతున్నా అంటూ..ముద్దుగుమ్మ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్!

Sunday, December 22, 2024

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా అందరికీ సుపరిచితమే. తన నటన, అందం తో ఎంతో మందిని కట్టిపడేసింది. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అదే విధంగా గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి తాజాగా ‘అరుణ్మణై 4’ అనే తమిళ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది.

ఇదిలా ఉంటే రాశీ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 10 ఇయర్స్ అవుతోంది అంటే నమ్మలేకపోతున్నా. నా మొదటి సినిమా టైంలో నాకు ఇక్కడి సంస్కృతి, భాషా ఏమి తెలియదు. అయినా ఇక్కడి వాళ్లు నన్ను అభిమానించి సొంత మనిషిలా చూసుకున్నారు. నాపై నమ్మకంతో డైరెక్టర్స్ నాకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు.

 అదేవిధంగా నా ప్రయాణంలో భాగమై నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను ఊహలు గుసగుసలాడే సినిమా చేస్తున్నప్పుడు చాలా భయపడ్డా.. కానీ కొన్నేళ్ల తర్వాత నటిగా ఇంత కంఫర్ట్ ఇచ్చిన సినిమా ఇదే కదా అని అనుకున్న. ఈ మూవీ విడుదలై అప్పుడే 10 ఏళ్లు అయిపోయిందా అన్నట్లు ఉంది. ఈ సినిమాలో నా నటనకు వచ్చిన ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోను. దానికి ఎప్పుడూ నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ వెలకట్టలేనిది అంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles