ఇది హిట్టవ్వడం మాకే ముఖ్యం!

Tuesday, January 21, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ క్రిస్మస్ కానుకగా విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే, ఈ సినిమాపై దర్శకుడు శంకర్ కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు.

కానీ, ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కావడం శంకర్ కంటే కూడా వేరేవారికి ముఖ్యంగా మారింది. ఇంతకీ శంకర్ సినిమా ఆయనకంటే ఎవరికి ముఖ్యం అయ్యిందా అని అంతా అనుకుంటున్నారు. కాగా, శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధిస్తుందా అని ఇండియన్-2 మూవీ మేకర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కానీ సక్సెస్ అయితే, తాము తెరకెక్కించే ‘ఇండియన్-3’కి ఊరట లభిస్తుందని మేకర్స్ అనుకుంటున్నారంట.

ఈ సినిమాను కూడా దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్నాడు. అయితే, గతంలో వచ్చిన ఇండియన్-2 భారీ అంచనాల మధ్య విడుదల అయినా, బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. దీంతో ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్లుగా సమాచారం. అయితే, ఇండియన్-3 చిత్రాన్ని వారు నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చూస్తున్నారట. కానీ, ‘గేమ్ ఛేంజర్’ విడుదల తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నారట.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles