దూసుకుపోతుంది!

Friday, April 4, 2025

దూసుకుపోతుంది! నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే ఊర్వశి రౌటేలా ఫీమేల్ లీడ్ లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో సాలిడ్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది.

ఇలా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా అదరగొట్టింది. ఒక్క ఇండియా లోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా డాకు మహారాజ్ భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇలా లేటెస్ట్ గా మొదటి వారంలోనే నెట్ ఫ్లిక్స్ లో 2 మిలియన్ కి పైగా వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో అందుకోవడమే కాకుండా ఇప్పటికీ ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

దీనితో చిత్ర నిర్మాణ సంస్థ కూడా డాకు మహారాజ్ ఓటిటి రెస్పాన్స్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles