పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ విడుదల దగ్గరపడుతున్న వేళ, ఈ సినిమాపై మళ్లీ హైప్ పెరుగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు పవన్ హాజరయ్యాడు. అక్కడ ఆయన చెప్పిన మాటలు చక్కగా అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ ప్రెస్ మీట్‌లో పవన్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడాడు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం గురించి చెప్పిన మాటలు అందర్నీ ఆలోచనలో పడేశాయి. పవన్ మాటల ప్రకారం.. రత్నం లాంటి నిర్మాతలు చాలా అరుదు. సినిమాల పట్ల ఉన్న వారి ప్యాషన్ అమోఘం. ఆయన ఏళ్ల కిందటే పాన్ ఇండియా సినిమాలు తీయడం ప్రారంభించారని, అలాంటి విజన్ ఉన్న వాళ్లు ఈ రోజుల్లో నెగెటివ్ పరిస్థితుల్లో పడిపోవడం తాను తట్టుకోలేకపోయాడని చెప్పారు.
ఇంతకాలం తన సినిమాలను తాను ప్రమోట్ చేయడంలో పాల్గొనలేదని కూడా పవన్ చెప్పారు. కానీ ఈసారి మాత్రం రత్నం చేస్తున్న ప్రయత్నాలు చూసి తాను స్వయంగా ముందుకు వచ్చానని చెప్పారు. తనే నటించిన సినిమాను పక్కనపెట్టి వదిలేయడమంటే ఓ బాధలా అనిపించిందని, అందుకే ఈ సినిమాకు పక్కన నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ఇక ఈ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి కూడా పవన్ ప్రశంసలు అందించారు. ఆమె ఈ సినిమాను ఒక బాధ్యతగా తీసుకుని ప్రమోషన్స్ చేస్తున్న తీరును గమనించి ఆయన చాలా ఇన్‌స్పైర్ అయినట్లు చెప్పారు.
మరొక ఆసక్తికర విషయాన్ని కూడా పవన్ పంచుకున్నారు. ఈ సినిమాకు ఆయన స్వయంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను కొరియోగ్రాఫ్ చేశారట. ఇది పూర్తిగా నిర్మాత ఏఎం రత్నం పట్ల ఉన్న అభిమానంతో చేసిన పని అని చెప్పారు.
చివరగా పవన్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. మంచి సినిమాలు రావాలంటే, మంచి నిర్మాతలు నిలదొక్కుకోవాలి. అలాంటి వారిని మద్దతుగా నిలబడటంలో తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. పవన్ హాజరైన ఈ ప్రెస్ మీట్‌తో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ఉంది.
