టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న యాక్టర్ సుమంత్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీస్తున్నారో రివీల్ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ‘అనగనగా’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ చేయబతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.దీనికి సంబంధించి వాలెంటైన్స్ డే రోజున ఓ క్యూట్ ఫోటో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.