అది ఇంకా ఖరారు అవ్వలేదు..కానీ చరణ్‌ మాత్రం!

Sunday, December 22, 2024

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ చేంజర్‌ సినిమాని పూర్తి చేశాడు. కొద్ది రోజుల గ్యాప్‌ తీసుకున్న చరణ్‌…వెంటనే తన మరో ప్రాజెక్టు మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టాడు. ఇప్పటికీ ఇంకా ఆ సినిమా టైటిల్‌ ని ఖరారు చేయలేదు..అందుకే ఆ సినిమాని రామ్‌ చరణ్ 16 వ సినిమా అని అంటున్నారు.ఈ సినిమాని బుచ్చిబాబు సాన డైరెక్షన్‌ లో తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ ఓ స్పోర్ట్స్ డ్రామాగా ప్రచారం జరుగుతోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా అని కూడా సమాచారం. ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చాలా కాలం నుంచి ఓ వార్త షికార్లు చేస్తున్నప్పటికీ ఇంకా మూవీ యూనిట్‌ నుంచి క్లారిటీ లేదు.

ఆ టైటిల్ పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే కానీ ఇంకా అదే ఫిక్స్ చేయాలని ఆలోచన అయితే లేనట్లే సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్యనే ఏఆర్ రెహమాన్ బుచ్చి బాబుతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మూడు పాటలను ఫైనల్ చేశారట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఆ మూడు పాటలు బుచ్చిబాబుతో సహా టీం కి బాగా నచ్చాయని పమాచారం.

ఇక మూవీ గురించి తాజా సమాచారం ఏమిటంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ప్రస్తుతానికి రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం లుక్స్ రెడీ చేసుకుంటున్నాడు. కొంతకాలం పాటు లో ప్రొఫైల్ మైంటైన్ చేసి లుక్ ఫైనల్ అయిన తర్వాత అధికారికంగా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles