అలా అనుకోవడం కరెక్ట్ కాదంటూ..ఫైర్‌ అయిన ఐశ్వర్య!

Wednesday, January 22, 2025

బాలీవుడ్‌ బిగ్‌ బి కోడలు , స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ పొన్నియన్‌ సెల్వన్‌ 1,2 చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత కాస్త ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ తనకు సంబంధించిన పలు పోస్టులు పెడుతూంటుంది.

అయితే ఐశ్వర్య హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీ ఇక్కడ సినిమాలు నటించకుండా హాలీవుడ్ చెక్కేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య ఈ విషయం పై రియాక్ట్ అయి ఫైర్ అయింది. అయితే యాంకర్ .. మీరు హాలీవుడ్‌కు వెళ్తున్నారని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

మీరు నిజంగానే  వెళ్లిపోతున్నారా? అని ప్రశ్నించగా.. అవునా ఏ ఇంటర్వ్యూలో అన్నానో దానికి సంబంధించిన వీడియో చూపించిన తర్వాతే మాట్లాడదాం. ప్రశ్నలు అడగండి కానీ నేను ఏదో చెప్పినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వకండి తమిళం, బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్‌లోనూ సినిమాలు చేస్తున్నా అలా అని హాలీవుడ్‌కు వెళ్లిపోతాను అనుకోవడం కరెక్ట్ కాదు’’ అంటూ సీరియస్‌ అయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles