అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆ హీరోకే ఓకే చెప్పిన సమంత!

Tuesday, January 21, 2025

ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో తన అందం, నటనతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయింది.

అయితే అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో ఓ సినిమాకు కమిటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు తెలుగులో సినిమాలే చేయకూడదు అని డిసైడ్ అయిన సమంతకు తెలుగు హీరో సినిమా ఆఫర్ రావడం, తప్పని పరిస్థితుల్లో ఆమె ఓకే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ నటించబోయే సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుందట . ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేస్తున్నారు . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. బడా బడా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న సరే రిజెక్ట్ చేసి సిద్దు జొన్నలగడ్డ సినిమాకు ఓకే చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. డెస్టిని అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles