వచ్చేసింది..వచ్చేసింది!

Sunday, December 22, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. ఫస్ట్ నుంచి పోస్టర్లు, టీజర్, సాంగ్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో విడుదల అయింది.

దీంతో ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. నవంబర్ 8న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఇందులోని చుట్టమల్లే చుట్టేసిందే.. అనే సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడీ వీడియో సాంగ్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.ఈ సాంగ్‌లో జాన్వీ హాట్ హాట్ అందాలు సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles