ఏంటి నిజం కాదా! ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ భారీ ప్రాజెక్ట్ సినిమాలలో డైరెక్టర్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో చేయనున్న సినిమా కూడా ఒకటి. వీరి కలయికలో సినిమా ఎన్నో ఏళ్ళు క్రితం నుంచి అలా కలగానే ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రెండు మెగా ఫోర్సెస్ కలిసాయి. ఇలా తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్త అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ రూమర్స్ కూడా వినపడుతున్నాయి. వాటిలో ఒకటి ఇపుడు నిజం కాదని తెలుస్తుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రముఖ బాలీవుడ్ నటి ఇపుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యిన ప్రియాంక చోప్రా ఉన్నట్టుగా ఆ మధ్య రూమర్స్ బాగా వినిపించాయి. కానీ ఇపుడు దీనిపై క్లారిటీ వినపడుతుంది. దీంతో ఆమె ఈ సినిమాలో లేనట్టే అని తెలుస్తుంది.