రాబోయే తేదీ ఇదేనా!

Saturday, September 21, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌  శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఇక వరుస అప్డేట్స్ ఉంటాయని మూవీ మేకర్స్ ఆల్రెడీ తేల్చి చెప్పేశారు.

అయితే ఈ సెప్టెంబర్ లోనే రెండో సాంగ్ ని విడుదుల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కానీ నెలలో సగం రోజులు అయిపోయినప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రీసెంట్ గానే థమన్ నెక్స్ట్ వీక్ లో సాంగ్ విడుదల ఉంటుందని తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ తేదీ  పై లేటెస్ట్ బజ్ వినపడుతుంది. దీని ప్రకారం ఈ పాట ఈ సెప్టెంబర్ 27న వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే దానికి ఓ రెండు లేదా మూడు రోజులు ముందు ప్రోమోని విడుదల చేయబోతున్నారని సమాచారం.

మరి ఈ పాట కోసం అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఈ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో  అని.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles