రెబల్‌ స్టార్‌ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా!

Tuesday, July 2, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ బాహుబలి తరువాత సలార్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ కల్కి సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే  ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్నట్లు దీనిని మొదటగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల  చెయ్యనున్నట్లు ప్రకటించారు. అయితే ఏపీలో ఎలక్షన్స్‌ వలన దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.  ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కిస్తున్నారు.సైన్స్, ప్లస్‌ పురాణాలు రెండు కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి మరింత చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా విడుదల గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి.

తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త ప్రచారం జరుగుతుంది. అది ఏంటంటే.. ఏపీలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సిన ప్రభాస్ కల్కి సినిమా వాయిదా పడింది. సినిమాని 30వ తేదీ విడుదల చేసేందుకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.

ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ విలన్‌గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా అతిథి పాత్రల్లో మెరవబోతున్నట్లు సమాచారం. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles