పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఓజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న హైప్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ విషయంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో ఉన్న క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‌లో మాత్రం కనిపించలేదని చెప్పాలి.
ప్రారంభంలోనే ఈ సినిమాను హిందీ, తమిళ్‌తో పాటు పలు భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ చెప్పినా, రిలీజ్ సమయం దగ్గర పడుతున్నా ఆ భాషల ప్రమోషన్లలో ఎటువంటి బజ్ లేకపోవడం గమనార్హం. ట్రైలర్ నుంచి పోస్టర్స్ వరకూ అన్ని అప్‌డేట్స్‌లో తెలుగు వర్షన్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ‘ఓజీ’ ఎక్కువగా తెలుగు ఆడియెన్స్ కోసం మాత్రమే మలచబడిన ప్రాజెక్ట్‌గా మారిపోయిందని చెప్పవచ్చు.
