ఎన్టీఆర్ నీల్.. సలార్ తో క్రాసోవర్ ఉందా..? లేదా?

Tuesday, December 16, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ మాస్ అండ్‌ యంగ్‌ డైరెక్టర్‌  నీల్ తో భారీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ముందు ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలు సలార్, అలాగే కేజీఎఫ్ చిత్రాల పట్ల ఆ మధ్య అంతా నీల్ సినిమాటిక్ యూనివర్స్ పై పలు క్రేజీ రూమర్స్ ఏ రకంగా హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే.

అయితే వాటి క్రాసోవర్ ఏమో కానీ నటుడు, సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం సలార్ కి నీల్ నుంచి మరో సినిమాకి ఓ క్రేజీ క్రాసోవర్ ఉందని రివీల్ చేయడం ఓ రేంజ్ లో అందరినీ ఎగ్జైట్ చేసింది. అయితే ఎలాగో కేజీఎఫ్ లో లేదని అపుడు క్లారిటీ వచ్చింది కానీ ఇపుడు ఎన్టీఆర్ నీల్ తో ఉండొచ్చు అని అనుకున్నారు కొందరు.

కానీ ఇపుడు దీనికి కూడా లింక్ లేనట్టే అని అనిపిస్తుంది. ప్రస్తుతం శృతి హాసన్ పేరు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కోసం వినిపిస్తుంది. ఈమె కానీ కనిపిస్తే ఈ రెండు భారీ సినిమాలకి లింక్ లేనట్టే అనుకోవాలి. ఎందుకంటే సలార్ లో ఆల్రెడీ శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించింది కాబట్టి ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో ఉండే అవకాశాలు లేవు అని తెలుస్తుంది. మరి ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles