ఆ స్టార్‌ హీరో పోటీ కా?

Sunday, December 22, 2024

కన్నడ సెన్సేషనల్ హిట్ సినిమా “కాంతార” కోసం అందరికీ తెలిసిందే. నటుడు రిషబ్ శెట్టి తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్‌  హిట్ అయ్యి రికార్డ్ వసూళ్లు తిరగరాసింది. ఇక దీనికి ప్రీక్వెల్ సినిమాని కూడా ఇపుడు తను చేస్తుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది ఆక్టోబర్ 2న పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే ఈ రేస్ లో ప్రస్తుతానికి ఏ సినిమా కూడా పోటీకి లేదు కానీ ఓ బజ్ అయితే ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న తన చివరి సినిమా కూడా ఈ డేట్ లోనే రావచ్చు అంటూ టాక్‌ వినపడుతుంది.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles