విశ్వంభరలో ఆ ఎపిసోడే మెయిన్‌ కాబోతుందా!

Tuesday, January 21, 2025

మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభ‌ర’పై ఇప్పటికే ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ తీర్చిదిద్దుతుండగా.. పూర్తి సోషియో ఫాంట‌సీ సినిమాగా ఇది రాబోతుంది. ఈ సినిమాలో చిరు స‌రికొత్త లుక్ లో ఆడియెన్స్ ను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో జ‌రుగుతోంది.

అయితే, ఈ సెట్స్ లో ఏలియ‌న్ సెట‌ప్ కూడా ఉంద‌ని, ప్ర‌స్తుతం దానికి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో విశ్వంభ‌ర అనే కొత్త ప్ర‌పంచాన్ని వెతుక్కుంటూ ప్ర‌యాణిస్తాడు. ఈ క్ర‌మంలో ప‌లు లోకాల‌ను దాటి వెళ్తుంటాడు. ఇందులో ఏలియ‌న్ల‌ను కూడా చూపించ‌బోతున్న‌ట్లుగా సమాచారం. ఈ సినిమాలో ఏలియ‌న్లతో చిరు చేసే కామెడీకి ఓ స్పెషల్ ట్రాక్ ఉంటుందని.. ఈ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంద‌ని టాక్‌.

ఇప్ప‌టికే ఈ సినిమా 80 శాతం చిత్ర షూటింగ్ పూర్త‌య్యింద‌ని, డ‌బ్బింగ్ ప‌నులు కూడా ప్రారంభించారు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న విడుదల చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles