శర్వా మెప్పించాడా..లేదా!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద తాజాగా నటించిన సినిమా మనమే. ఈ సినిమాని శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో క్యూట్‌ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌ గా చేసింది. ఈ సినిమాని జూన్‌ 7 న గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ జూన్ 6 నుంచే వేయడం జరిగింది.అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ సినిమా ఎంతో స్లో గా సాగుతుంది అని.. చూసే ప్రేక్షకులకు ఎంతో బోరింగ్ కలిగించిందని కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమాలోని కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం కూడా హీరో ,హీరోయిన్ ,ఓ చిన్న పిల్లాడి చుట్టూనే  ఉంటుంది.ఈ సినిమా మొదటి పార్ట్‌  లో శర్వానంద్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన సెకండ్ హాఫ్ లో మాత్రం తేలిపోయినట్లుగా ఉందంట

ఈ సినిమాలో హీరో శర్వానంద్ ,పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ మాత్రమే ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.కానీ  ఈ సినిమాలో విలన్  పాత్ర కూడా అంత ఇంటెన్సివ్ గా లేకపోవడంతో ప్రేక్షకులను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles