డ్రాగన్‌ సినిమాలో ఎన్టీఆర్ విలనా..?

Sunday, December 22, 2024

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ కేజీఎఫ్ మూవీ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌ లో ఓ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ‘NTR31′ అనే వర్కింగ్ టైటిల్ తో ఎప్పుడో ప్రకటించారు.’సలార్ 2’ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ టైటిల్ ను బట్టి ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు సినీ వర్గాలు అనుకుంటున్నాయి. డ్రాగన్‌ అంటే యూరోపియన్‌ సంస్కృతిలో చెడుకి గుర్తు. మైథాలజీలో ‘డ్రాగన్‌’ అంటే రాక్షసుడు. చూపులకు పాములా, కాళ్లజెర్రిలా కనిపించే డ్రాగన్‌కి నిప్పును పీల్చే గుణం ఉంటుంది.

అలాగే డ్రాగన్‌ అంటే అలజడికి బ్రాండ్‌ అంబాసిడర్ అని చెప్పుకొవచ్చు. ఇలాంటి భయంకరమైన టైటిల్‌ని ఎన్టీఆర్ సినిమా కోసం మేకర్స్ పరిశీలిస్తుండటంతో సినిమాలో ఎన్టీఆర్ చేసేది నెగెటివ్ రోల్ అని, ప్రశాంత్‌ నీల్ టైటిల్‌కి తగ్గట్టుగా తారక్ క్యారెక్టర్ ను డిజైన్‌ చేశారని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ మరోసారి నెగిటివ్ రోల్ లో అదరగొట్టడం గ్యారెంటీ అని తెలుస్తుంది. సినిమా అంతా యూరోపియన్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles