నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై ప్రొడ్యూస్ చేస్తున్న తాజా సినిమా ‘కోర్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్లుగానే ఇదొక కోర్టు రూమ్ డ్రామాగా ప్రేక్షకులను కట్టిపడేయనుంది. ఇక ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓటీటీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది.
‘కోర్ట్’ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.9 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ.9 కోట్లు అంటే, ఈ సినిమాకు ఇది సేఫ్ ప్రైజ్ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని రూ.9 కోట్ల బడ్జెట్‌లోపే పూర్తి చేశారట చిత్ర బృందం. ఈ లెక్కన కేవలం ఓటీటీ రైట్స్‌తోనే నాని సేఫ్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ నానికి లాభాలను తెచ్చిపెట్టనున్నాయని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
