టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ని ప్రకటించగా..దీనిపై భారీ హైప్ అయితే సెట్ అయ్యింది. ఇక ఈ సినిమా కాకుండా మరో దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా ఉందని చాలా రోజుల నుంచి ఓ టాక్ వినపడుతుంది.
మరి ఈ సినిమా గురించి మళ్ళీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా చర్చ మొదలైంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుంది అని వినపడుతుంది. ఇక దీంతో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినపడుతుంది. దీంతో ఈ సినిమాకి “సంక్రాంతికి వస్తున్నాం” సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోనే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీరి కలయికలో ఇది కొత్త ప్రయత్నమే అని చెప్పాలి. మరి చిరు రేంజ్ మ్యూజిక్ ని ఈ యువ దర్శకుడు అందిస్తాడో లేదో చూడాల్సిందే.