ఆసక్తికరంగా వీక్షణం!

Wednesday, December 25, 2024

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్దంగా ఉంది.

ఈ రోజు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ – నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ చేశాను, ఒకరోజు విక్టరీ వెంకటేష్ నా దగ్గర ఓ మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడమే. ఆయన చెప్పిన ఆ మాటే మా వీక్షణం సినిమా స్టోరీ. మా చిత్రంలో హీరో ఎప్పుడూ పక్కోడి లైఫ్ లో ఏం జరుగుతుందో చూడాలనే ఆత్రుతతో ఉంటాడు.

ఆ ఉత్సాహం వల్ల అతనికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ నెల 18న థియేటర్స్ లో మా సినిమా చూసి  సపోర్ట్ చేయండి. టీజర్ లాంఛ్ రోజే చెబుతున్నా, మేము తప్పకుండా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని. ఆ రోజు మళ్లీ మీ అందరినీ కలుస్తా అని చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles