విజయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Andhrawatch
1 Min Read

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబోలో “ది గోట్” అనే  మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది విజయ్ కెరీర్ లో 68వ సినిమా కాగా ఈ సినిమా తర్వాత విజయ్ ఒక్క సినిమా చేసి సినిమాలకి స్వస్తి చెప్పనున్నట్టు తేల్చి చెప్పేశాడు. అయితే ఈ సినిమా ఎవరితో చేస్తాడు అనే దాని గురించి మాత్రం ఎప్పటి నుంచో సస్పెన్స్‌ గా మారింది. ప్రస్తుతం దీని పై ఓ స్ట్రాంగ్ బజ్‌ వినపడుతుంది.

దీని ప్రకారం విజయ్ ఫైనల్ సినిమాని ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహించడం కన్ఫర్మ్ అయ్యింది. అంతే కాకుండా ఇది వరకు వినిపించిన బజ్ ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే టాక్  ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించనున్నట్టుగా సమాచారం. మరి ఈ చిత్రంపై అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

Share This Article