“రాబిన్‌హుడ్‌” నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో , డైరెక్టర్‌ వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ రాబిన్‌ హుడ్‌ సినిమా.  ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర బృందం అందించింది.

శుక్రవారం ఉదయం 11:07 గంటలకి బాస్ లేడీ కి సంబందించిన అప్డేట్ రానుంది. సినిమాలో హీరోయిన్ రోల్ పై శుక్రవారం క్లారిటీ రానుంది.ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles