మనమే టీజర్ గురించి కృతి శెట్టి ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌!

Sunday, December 22, 2024

తెలుగు హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌ లో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా డైరెక్టర్ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో మనమే సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల పై తాజాగా హీరోయిన్ కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేశారు. మనమే టీజర్ ఇక్కడ ఉంది? డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు, ఇంకా వెయిట్ చెయ్యడం మా వల్ల కాదు అంటూ…ఎంతో క్యూట్‌ గా పోస్ట్‌ పెట్టింది.  ఇందుకు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెస్పాండ్ అయ్యింది.

ఇంత క్యూట్ గా అడుగుతున్నారు. ఇచ్చేయండి సార్, త్వరగా టీజర్ డేట్ ఇచ్చేయండి అంటూ చెప్పుకొచ్చారు. శర్వానంద్‌ కెరీర్ లో 35 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles