ఇండియన్ సినిమాల్లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ “వార్ 2” చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. యాక్షన్ మూవీ లవర్స్ లోనే కాదు, ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై విపరీతమైన హైప్ కనిపిస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉండగానే పలు రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో తాజా కథనం ఏంటంటే, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇద్దరు హీరోలు కలసి ముచ్చటగా స్టేజ్ పంచుకోరట. సినిమాలో వీళ్ల మధ్య సాగే యాక్షన్, క్లాష్ కు తగ్గట్టుగానే రియల్ లైఫ్ ప్రమోషన్ లో కూడా వేరే వేరే విధంగా పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది.
ఇది ఒకవేళ నిజమే అయితే, ఒకే సినిమా అయినా ప్రేక్షకులకు ప్రతి హీరో వైపు ప్రత్యేకంగా ఫోకస్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈ రకమైన ప్రమోషన్ స్టైల్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి కానీ, ఇది సినిమా పైన ఉన్న అంచనాలను మరింత పెంచే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఆసక్తికరమైన స్క్రీన్ వార్ మాత్రమే కాదు, ప్రమోషనల్ వేదికలపై కూడా అలాంటి రైవల్రీ కనిపిస్తే ఫ్యాన్స్ కి ఇది మరింత థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించనుంది.
