ఇన్‌ స్టా అకౌంట్‌ తొలగించిన యంగ్‌ హీరో!

Tuesday, January 21, 2025

టాలీవుడ్ యంగ్‌ హీరో , మాస్ కా దాస్‌ విశ్వక్ సేన్ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌ గా ఉంటాడో తెలిసిందే. అభిమానులుతో నిత్యం టచ్‌ లో ఉంటూ తన సినిమా అప్డేట్స్‌ తో పాటూ కొన్ని సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ ఉంటాడు. అలాగే ట్రోలర్స్ కు ఎప్పటికప్పుడు సాలిడ్ కౌంటర్లు వేస్తుంటాడు. అలాంటి ఈ హీరో ఇప్పుడు సోషల్ మీడియాకు దూరమయ్యాడు.

విశ్వక్ సేన్ తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేశాడు. తాజాగా విశ్వక్‌సేన్‌ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టారు. సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు అందులో వివరించారు. ఇది చూసిన అయన ఫ్యాన్స్ కేవలం కొన్ని రోజులు పోస్ట్‌లు పెట్టరేమో అని భావించారు. కానీ, ఇప్పుడు  ఇన్‌స్టాలో విశ్వక్‌  అకౌంట్‌ అసలు కనిపించడమే లేదు. దీంతో కారణమేంటని ఆయన అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా యూట్యూబ్‌, సోషల్‌ మీడియాల్లో నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిపై విశ్వక్‌సేన్‌ ఇటీవల ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. దీని గురించి తన ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్‌ కూడా పెట్టారు. ఓ యూట్యూబర్‌ ‘కల్కి’ రిలీజ్‌ కాకముందే రివ్యూ ఇవ్వడంపై ఆయన తప్పు పట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంది. దీంతో ఇప్పుడు విశ్వక్ తన ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేయడంతో రీజన్ ఇదే అయి ఉంటుందని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అసలు రీజన్ ఏంటో తెలియాలంటే విశ్వక్ సేన్ దీని గురించి స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles