సాయి పల్లవికి అన్యాయం!

Tuesday, January 21, 2025

తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అవార్డుల్లో చాలా సినిమాలు తమ సత్తా చాటాయి. దక్షిణాదిలో కార్తికేయ-2, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ కన్నడ చిత్రం KGF 2, ఉత్తమ తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1, ఉత్తమ నటి నిత్యా మీనన్, ఉత్తమ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అవార్డులు అందుకున్నారు.

అయితే ఈ అవార్డుల్లో ఓ హీరోయిన్‌కి అన్యాయం చేశారంటూ అవార్డులు నిర్వహించిన వారిపై ఆ హీరోయిన్ అభిమానులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరోయిన్ కి రెండు సార్లు అన్యాయం జరిగిందంటూ అభిమానులు తమ ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. అప్పుడు ఫిలింఫేర్ అవార్డ్స్ లో పూజా హెగ్డే, ఇప్పుడు నిత్యమీనన్ కు ఇద్దరికీ అవార్డులు ఇచ్చి తమ హీరోయిన్ కు అన్యాయం చేశారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

నేచురల్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవికి 2022 నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో  అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ, లవ్ స్టోరీ ఆ సంవత్సరం నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి నటన వేరే లెవల్‌ అంతే. కానీ ఆమె వెనుకబడి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ హీరోయిన్ పూజా హెగ్డేకి అవార్డు ఇచ్చారు.

ఆ సమయంలో సాయి పల్లవి అభిమానులు పూజా హెగ్డేపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు పూజా హెగ్డే డబ్బుతో అవార్డును కొనుగోలు చేశారని విమ.ర్శించారు.అయితే రీసెంట్ గా జరిగిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందంటూ నిత్యా మీనన్ కి అవార్డ్ ఇచ్చి ఆమె అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గార్గి సినిమాలో సాయి పల్లవి నటన కంటే నిత్యా మీనన్ పెర్ఫార్మెన్స్ ఏం బాగుందని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles