‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ నుండి ”మా ఊరి జాత‌ర‌లో”

Wednesday, January 22, 2025

అల్ల‌రి న‌రేశ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’. ఈ సినిమా ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేశ్ మరోసారి సీరియ‌స్ పాత్ర‌లో యాక్ట్‌ చేస్తుండడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను సుబ్బు మంగ‌దేవి డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ ”మా ఊరి జాత‌రలో” తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ పాట ప్యూర్ ఫోక్ మెలోడిగా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటుంది. ఈ పాట‌ను గౌర‌హ‌రి, సింధూరి విశాల్ లు పాడారు. అర్ధ‌వంత‌మైన లిరిక్స్, ఆక‌ట్టుకునే ట్యూన్ తో ఈ పాట చాలా బాగుంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ అమృత అయ్య‌ర్ హీరోయిన్ గా నటిస్తోండ‌గా హ‌రితేజ‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యాన‌ర్ పై రాజేష్ దండ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles