తమిళ స్టార్ హీరో ధనుష్‌పై నయనతార పలు ఆరోపణలు చేస్తూ ఓ లెటర్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నయనతార జీవితంపై నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనిలో, ‘నానుమ్ రౌడీ ధాన్’(తెలుగులో నేనూ రౌడీ నే) అనే సినిమాను ధనుష్ నిర్మించాడు. ఈ సినిమాలోని ఓ మేకింగ్ సీన్ విజువల్స్ ను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించుకున్నారు.
అయితే, తన నిర్మాణంలో వచ్చిన సినిమాకి సంబంధించి 3 సెకన్ల మేకింగ్ సీన్ విజువల్స్ ను నయనతార డాక్యుమెంటరీలో చిత్ర బృందం వాడుకుంది. దీంతో తనకు రూ.10 కోట్లు నష్టపరిహారంగా డిమాండ్ చేశాడు ధనుష్. ఈ క్రమంలోనే ధనుష్ పై నయనతార ఎన్నో ఆరోపణలు చేసింది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తనను అర్థం చేసుకోవడం చాలా కష్టమంటూ పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు.
ఇంతకీ, ధనుష్ ఏం మాట్లాడాడు అంటే.. ‘నాతో సన్నిహితంగా ఉండేవారికి నేనేంటో తెలుస్తుంది. ఎవరికీ నేను అంత సులభంగా దగ్గర కాను.. అందుకు చాలా సమయం పడుతుంది. నాతో సుధీర్ఘ కాలం పరిచయం ఉన్నవారే నన్ను అర్థం చేసుకుంటారు’ అంటూ ధనుష్ అన్నారు.