సినిమాల్ని వదిలేస్తా…సుకుమార్ సంచలన వ్యాఖ్యలు!

Friday, January 24, 2025

పుష్ప 2 బెనిఫిట్‌ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఘటన తర్వాత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై ఇన్‌ డైరెక్ట్‌ గా విమర్శలు చేయడంతో ఈ వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఇవన్నీ అల్లు అర్జున్‌పై ఎంత ప్రభావం చూపించాయనేది తెలియదు, కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం వీటి వల్ల  మానసికంగా కృంగిపోయాడని తెలుస్తోంది.

తాజాగా ‘పుష్ప 2’ సక్సెస్ మీట్‌లో, మహిళ మృతి గురించి మాట్లాడుతూ సుకుమార్ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా సినిమాలు వదిలేస్తా అని ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటనతో అందరూ షాక్ అవుతున్నారు. యూఎస్‌లో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌లో సుకుమార్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో సినిమాలోని ‘ధోప్’ అనే పాట విడుదల చేశారు.

ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో, యాంకర్ సుమ సుకుమార్ ను..’ మీరు ఒకవేళ ‘ధోప్’ ‘  అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు అని ప్రశ్నించగా.. సుక్కు ఏకంగా ‘సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా’ అని చెప్పి అందరికీ పెద్ద షాక్‌ ఇచ్చాడు.

దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అనంతరం సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని ‘అలా చేయరులే’  అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌  మీడియాలో ఫుల్‌ వైరల్‌ గా మారింది. దీన్ని చూసి నెటిజన్స్..’ ప్రెజెంట్ సిచ్యుయేషన్ వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయ్యి ఇలాంటి కామెంట్ చేసి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles