ఓర్ని వార్ చేస్తున్నారనుకుంటే..మీరు చేసే పని ఇదా!

Sunday, December 22, 2024

జూనియర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ నుంచి సినిమా రాకపోవడంతో అభిమానులు కూడా ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొరటాల శివతో దేవర సినిమా, బాలీవుడ్‌ లో హృతిక్‌ కాంబోలో వార్‌ 2 వస్తుంది.

ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల షూటింగ్‌ లతో తారక్‌ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సోమవారం ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి నటులు తమ వ్యక్తిగత సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషెస్‌ కు  ఎన్టీఆర్ స్వయంగా థ్యాంక్స్ చెబుతూ వస్తుండగా ఇప్పుడు హృతిక్  చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా  మారింది.

ఇక ఇదిలా ఉండగా ‘వార్‌ 2’ కో యాక్టర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కోసం సోషల్ మీడియాలో తన హృదయపూర్వక విషెష్ తెలియచేశారు.తన X హ్యాండిల్‌లో హృతిక్ రోషన్, తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు! సూర్యుని చుట్టూ తిరిగే మరో అద్భుతమైన స్పిన్ ఇక్కడ ఉంది, ఈసారి మేము కలిసి తిరుగుతాము! చివరికి వంటగదిలో ఉన్న విద్యార్థిని చూసి మాస్టర్ గర్వపడతారని నేను ఆశిస్తున్నాను! హాహా ! స్టే హెల్తీ, స్టే బ్లేస్డ్ అంటూ రాసుకొచ్చారు.

దీంతో వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, “హహహ… చాలా ధన్యవాదాలు సర్. సెట్స్‌లో మీతో సామరస్యపూర్వకమైన యుద్ధం జరిగింది. మీతో తిరిగి రావడానికి, కలిసి సూర్యుని చుట్టూ తిరిగేందుకు వేచి ఉండలేను… అందరూ చెప్పినట్లు విద్యార్థి సిద్ధంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు కనిపిస్తాడు, మీరు సిద్ధంగా ఉన్నారు అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో వీరిద్దరూ ఏదో వార్ చేస్తున్నారు అనుకుంటే ఇద్దరూ కలిసి వంట నేర్చుకుంటూ నేర్పించుకుంటున్నారా? అంటూ  సరదా కామెంట్లు కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles