టాలీవుడ్ ప్రేక్షకులకు మొదటి సూపర్ హీరో ఫిల్మ్ ఇచ్చిన తేజ సజ్జ ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చాడు. అతను హీరోగా నటించిన కొత్త సినిమా పేరు మిరాయ్. ఈ ప్రాజెక్ట్‌ని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా, పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కూడా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు డివోషనల్ టచ్ కలిగిన సినిమా అని స్పష్టమైంది.
తెలుగులో ఈ మధ్య కొన్ని సినిమాలకు సంబంధం లేకపోయినా టికెట్ ధరలు పెంచిన సందర్భాలు ఉన్నాయి. కానీ గతంలో హను మాన్ సినిమాకి అలాంటి పెంపు చేయకుండానే సాధారణ రేట్లతో రిలీజ్ చేసి రికార్డు కలెక్షన్లు అందుకున్నారు. అదే పద్ధతిని మిరాయ్ మేకర్స్ కూడా అనుసరిస్తున్నారు.
