కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల వయసులోనూ మంచి ఫిజిక్ ను మైటైంన్ చేస్తూ కుర్ర హీరోలకి మంచి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికీ అమ్మాయిల మనసులో నవమన్మధుడు అనిపించుకుంటున్నాడు. ఇక కేవలం సినిమాలే కాకుండా బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున ఎయిర్ పోర్ట్‌లో వెళ్తుండగా అక్కడ పనిచేసే ఓ పెద్దాయన నాగార్జునతో మాట్లాడటానికి ప్రయత్నం చేయగా.. పక్కనే ఉన్న అతని బాడీ గార్డ్ అతన్ని పక్కకు తోసేశాడు.
దీంతో ఆ పెద్దాయన కిందపడిపోయాడు. అప్పుడు అక్కడే పక్కన పని చేస్తున్న మరికొంతమంది వ్యక్తులు అతన్ని పట్టుకున్నారు. అయితే ఈ సందర్భాన్ని , జరిగిన విషయాన్ని నాగ్ గమనించలేదు. ఈ ఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగార్జున ఆ వీడియో పై స్పందించాడు.
ఆయన స్పందిస్తూ.. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఇలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెద్దాయనకు క్షమాపణలు చెప్తున్నాను. భవిష్యత్తులో మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో నాగ్ ట్వీట్ వైరల్ అవ్వగా పలువురు బాడీగార్డ్ చేసిన తప్పుకు నాగార్జున ఏం చేస్తాడు, నాగార్జున చూస్తే అలా చేయనిచ్చేవారు కాదు, అయినా నాగార్జున క్షమాపణలు చెప్పాడు అని ఆయనకు సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.