జాతీయ నటుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా పుష్ప 2 ఇపుడు దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే దీనిని మించి తన అరెస్ట్ అంశం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది.
అయితే అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ ఘటనలో నిన్న చిక్కడపల్లి పోలీసు వారు అరెస్ట్ చేసిన ఘటన పెద్ద ఎత్తున సంచలనంగా మారగా అల్లు అర్జున్ నిన్ననే విడుదల కావాల్సి ఉంది కానీ తాను ఈరోజు తెల్లవారు జామున విడుదల అయ్యాడు.
అయితే ఈ విడుదల అనంతం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఇందులో తాను చేసిన కామెంట్లు ఇపుడు వైరల్ అవుతున్నాయి. తన ఇంటి దగ్గర నుంచి నేను బాగానే ఉన్నాను… నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఇన్నేళ్ల నుంచి నేను ప్రతీ సినిమాకి ఇలానే వెళ్లాను కానీ ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ కుటుంబానికి అండగా నేనున్నాను తప్పకుండా వారికి ఎలాంటి సాయం కావాలి అన్నా ఎల్లప్పుడూ నేను అందుబాటులోనే ఉంటాను అని తెలిపాడు.
అలాగే ప్రస్తుతం కేసు కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఏం మాట్లాడలేను అని బన్నీ తెలిపాడు. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.