మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్2: ఎంపురాన్ ’ రాబోతుంది. అయితే, ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ పంపే మటన్ అంటే నాకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా మటన్‌తో చేసిన వంటకం నాకు చాలా బాగా నచ్చింది’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు. లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ చెప్పాలనుకున్న స్టోరీ థీమ్ అదిరిపోయింది.
ముఖ్యంగా సినిమా నిండా ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే మోహన్ లాల్, వివేక్ ఒబెరాయ్ మరియు మంజు వారియర్ పాత్రలు కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి.