నాకు గీతా ఆర్ట్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు సామి!

Sunday, December 22, 2024

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దీనికితోడు ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు మూవీ మేకర్స్‌. ‘విశ్వం’ టీజర్‌ను మేకర్స్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. ఈ టీజర్‌లో గోపీచంద్ తన యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక వింటేజ్ శ్రీను వైట్ల మార్క్ కామెడీ మనకు ఈ టీజర్‌లో క్లియర్‌ గా కనిపిస్తుంది. ఆయన నుంచి ఎలాంటి కామెడీ లైన్స్ వినాలని ప్రేక్షకులు చూస్తున్నారో, అవి ఈ టీజర్‌లో కనిపించి వినిపించాయి.

‘‘మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా.. నాకు గీతా ఆర్ట్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు’’ అనే  కామెడీ పంచ్‌లు సినిమాలో బాగా పేలుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ‘వెంకీ’ మూవీ తరహా ట్రైన్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది.

మొత్తంగా చూస్తే, ‘విశ్వం’ మూవీతో శ్రీను వైట్ల గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టి కసి మీదే ఉన్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles