చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి పల్లవి, విజయ్ సేతుపతి తమ సత్తా చాటారు. అమరన్ చిత్రానికి గానూ సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డును ప్రకటించారు. ఇక మహారాజ సినిమాలో నటనకు గానూ విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఉత్తమ చిత్రంగా అమరన్ నిలవగా…ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ పందు ఉన్నాయి. అంతే కాకుండా ఉత్తమ సంగీత దర్శకుడిగా అమరన్ సినిమా కి గానూ జీవీ ప్రకాష్ కి అవార్డు వరించింది.
అమరన్ సినిమాటోగ్రఫర్, ఎడిటర్‌లకు అవార్డులు వచ్చాయి. సహాయ నటుడిగా లబ్బర్ పందులో చేసిన దినేశ్‌కు వచ్చింది. వేట్టయన్ మూవీలో దుషారా పాత్రకి గానూ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది. దీంతో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది.
ముకుంద్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య చూపించినప్రేమ, ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించాను. అభిమానుల ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ వీర జవాను కథ ఇది.. ఈ కథను అందరూ కలిసి విజయవంతం చేశారు. రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అంటూ ప్రశంసలు కురిపించింది.