మహేష్‌ సినిమా కోసం భారీ సెట్‌!

Friday, December 5, 2025

టాలెంటెడ్ యాక్టర్ విరాట్ కర్ణ తొలిసారి “పెద కాపు” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయన రెండో సినిమాగా “నాగ బంధం” అనే ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ఇది పూర్తిగా పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న సినిమాగా ప్రాముఖ్యత సాధిస్తోంది. నిర్మాణ బాధ్యతలను దేవాన్ష్ నామా మరియు మధుసూధన రావు తీసుకున్నారు. ఈ సినిమాను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో చారిత్రక నేపథ్యంలో ఫాంటసీ టచ్ ను జోడించి భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ కథకు తగ్గట్టుగానే హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడా వద్ద రామానాయుడు స్టూడియోస్‌లో ఒక భారీ సెట్ను రూపొందించారు. దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చుతో చేసిన ఈ సెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సెట్ డిజైన్ బాధ్యతలు తోట ధరణి చేపట్టారు. ఇంతకముందు మహేష్ బాబు “అర్జున్” సినిమాలో మధురై మీనాక్షి ఆలయం కోసం అద్భుతమైన సెట్ను రూపొందించిన తోట ధరణి, ఇప్పుడు “నాగ బంధం” కోసం మరింత గ్రాండ్ స్థాయిలో పని చేసినట్టు సమాచారం. ఇప్పుడే ఈ సెట్లో ముఖ్యమైన సీన్లను షూట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే సంగీతంఅభే  అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు టీమ్ నుండి సమాచారం అందుతోంది.

ఈ సినిమా చూస్తే విజువల్స్ పరంగా కూడా ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అందుతుందని టాక్. హిస్టరీ, ఫాంటసీ, గ్రాఫిక్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకులకు ఓ నూతన అనుభూతి ఇవ్వడానికి “నాగ బంధం” రెడీ అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles