గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టినప్పటికీ శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.గేమ్ ఛేంజర్ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బచ్చిబాబు సన డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించిన కూడా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.జూన్ లో రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. అయితే ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను డైరెక్టర్ బుచ్చి బాబు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లు లో చిత్ర బృందం ఓ భారీ సెట్ నిర్మిస్తున్నట్లు టాక్. పాటల చిత్రీకరణతో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.