భారీ ప్రాజెక్టే!

Tuesday, April 1, 2025

భారీ ప్రాజెక్టే! రీసెంట్ గా మళయాల సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన మోస్ట్ వైలెంట్ చిత్రం “మార్కో” కోసం అందరికీ తెలిసిందే. నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ సినిమా ఒక్క మళయాళం లోనే కాకుండా తెలుగు సహా హిందీలో కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది.

అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు హిందీ సినిమాకి వెళ్లనున్నట్టుగా టాక్ వచ్చింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో భారీ ప్రాజెక్ట్ ని చేస్తున్నట్టుగా టాక్ రాగ ఇపుడు దీనిపై మరిన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మార్కో సినిమాని వైలెంట్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తే ఈసారి హిందీలో సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గా మాత్రం చేయనున్నారట.

అలాగే ఈ చిత్రాన్ని హిందీలోనే తెరకెక్కించి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి మొత్తానికి ఈ యువ దర్శకుడు బాలీవుడ్ లో గట్టి డెబ్యూ ఇచ్చేలా ఉన్నాడని చెప్పవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles